అనురాగం - అభిమానం కలగలిపి
ఆనందం - ఆప్యాయతలు మాకు తెలిపి
ప్రేమకు పర్యాయంలా, గౌరవం గర్వపడేలా,
అసూయలేని, కోపం రాని,
ఇష్టాన్ని వీడక, మంచిని మరవక ,
బంధాలకు బానిసై అనుబంధాల
ఒడిలో వెలసిన రాధే …
‘అనురాధై’ వచ్చారు.
వ్యక్తిగతంగా
ఆదరించి ,
వృ త్తి పరంగా
ప్రోత్సహించి
మా పొరపాట్లను
సైతం మీవిగా భరించి,
మాతో సాగిన మీ
సహచరణ,
మా కై చేసిన మీ కార్యచరణ.
ఓర్పు ,
సహనం మీ పలు గుణాలు ,
మాకు నేర్పాయి
ఎన్నో పాఠాలు.
క్షమా గుణంతో
సాగిన మీ విధానాలు ,
మాకు
అయ్యాయి మార్గదర్శకాలు .
ఒక తల్లిగా మీ పిల్లల
పెరుగుదల గురించి ఆలొచిస్తూ ,
ఒక అధికారిగా
ఈ పిల్లల ఎదుగుదల గురించి అన్వేషిస్తూ,
మీ బాధ్యత కు, మీ వృత్తికి సమన్యాయం చేసి
మీకు మీరే సాటి అని అనిపించుకున్నారు
మీ పిల్లలపై మీరు పెట్టుకున్న ఆశలు
ఆ దేవుని ఆశీస్సులతో నెరవేరాలని
మీరు సుఖ – శాంతులతో
ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు
వర్ధిల్లాలని
ఆశిస్తూ...
ఇదే ..
మీకు మా వీడుకోలు !!
No comments:
Post a Comment