Monday 28 April 2014

సదా నీ ప్రేమలో.. మీ అమ్మ- నాన్న !

తల్లీ..!
ఆ దేవుని దీవెనతో
ఆశించిన అనురాగంతో
అందిన ఆశీస్సులతో
పొందిన దేవత నువ్వు

నీ తొలకరి చిరు పలుకులు
నీ సొగసరి తొలి అలకలు
నీ బుడు బుడి వడి  నడకలు
నీ తొలి బడి కేరింతలు
మాపై పడి గిలిగింతలు
నీకెంతో అందం
మాకెంతో ఆనందం !

అల్లుకున్న మల్లె తీగ
ఇంటికెంత అందమో
నీ అల్లరన్న మాకు కూడ
అంతకంటే అందమే!

నీ పసి పుగ్గపై విరిసిన
పసిడి సిగ్గులు
మా జీవితపు పెరట్లో
విరబూసిన మల్లె మొగ్గలై
మా హృదయపు వాకిట్లో
వెలసిన రంగుల ముగ్గులై
వెన్నలను - వెలుగును
సువాసనను - సుమఅందమును
సంతోషమును - సౌఖ్యమును 
అన్ని వేళలా అందివ్వాలనేదే
మా ఆశ !  మా ఆకాంక్ష!!


                                     - సదా నీ ప్రేమలో...  మీ అమ్మ- నాన్న !


Tuesday 15 April 2014

ఓటరా..! ఇది నీ ఓటురా..!!

ఓటరా ఇది నీ ఓటురా..!
ఓటరా నీ రూరేటేదిరా..!!

ఓటంటే నోటు కాదు
ఓటంటే మాట కాదు
ఓటంటే రాంగు రూటు కాదురా

ఓటరా ఇది నీ ఒటురా
ఓటరా నీ రూటేదిరా

ఓటుని నువ్వు ఒదులుకోకు
ఓటమిని నువ్వు ఒప్పుకోకు
ఓరిమిగా నువ్వు వుండబోకు

ఓటరా ఇది నీ ఒటురా
సోదరా  గెలుపై సాగరా

ఓటు ఎందుకంటావా
ఓటుని వేయనంటావా
నోటుకి ఒటేస్తావా

ఏ సి రూముల కిటికీలోనించి
పేద ప్రజల బ్రతుకు చూడు
తెలుస్తుంది ఓటు విలువ!
పంట పండక కడుపు నిండక 
పస్తులుండే రైతుని అడుగు
తెలుస్తుంది ఓటు విలువ!
ఊరి బళ్ళో చదవు లేక
బయట  బళ్ళో చదవలేక
ఉన్నత చదువును కొనలేక
డిగ్రీ చేసినా..  జాబులుండక
రోడ్డున పడ్డ బిడ్డలనడుగు
తెలుస్తుంది ఓటు విలువ!
నీకు  అన్యాయం జరిగినపు డో  
అవినీతి ఎదురైనపు డో
గుర్తొస్తుం దా  ఓటు విలువ ?
ఓటరా ఇది నీ ఒటురా!
సోదరా  ఆలోచించరా!

చీరా జాకేట్లకో - సారా పాకేట్లకో
క్రికెట్టు కిట్లకో - వేల నోట్ల కట్లకో
బీరు - బిర్యానీలకో
ఆశ పడో  ఆరాట పడో
ఆ పూట ఆకలి మర్చిపోఎందుకో
ఆ రోజు అవసరం తీర్చుకోనేందుకో
ఆవేశంలొ నువ్వు ఆలోచించక వోటేస్తే ...

నాయకులే మాయకులై
పగవారే పాలకులై 
కీచకులై  కింకరులై
పరువులోదిలి పదవులెక్కి
హీనులైన నాయకులే
బలహీనులైన ప్రజలపైన
హీనమైన రాజకీయం చేస్తుంటారు
ఓటరా ఇది నీ ఒటురా
ఓటరా నీ రూరేటేదిరా

నిన్ను నువ్వు ప్రశ్నించు ఒక్కసారి
ఈ ఓటును నువ్వెందుకు వేస్తున్నావు ప్రతిసారి
దీటైన ఓటుతో దొరుకుతుంది సమాధానం
ఇదే ఒటుని వినియోగించే విధానం !!

ఓటరా ఇది నీ ఒటురా
ఓటరా నీ రూరేటేదిరా
సోదరా  ఆలోచించరా
ముందుకు సాగరా ..!
గెలుపుని సాధించారా ..!!

“ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఎంత తప్పో”“ 
స్వార్థం కోసం ఒటుని దుర్వినియోగం చేసుకోవడం కూడా అంతే తప్పు" 
                                                                           --  జై హింద్


మై స్పీచ్ అబౌట్ త్రివిక్రమ్ !

"త్రివిక్రమ్" శ్రీనివాస్
గురించి మాట్లాడటానికి
నాకున్న శక్తి  సరిపోదు
నాకున్న ఒకాబులరీ సరిపోదు
ఆయన స్థాయి వేరు
ఆయన స్థానం వేరు....
.......................................  
....................................... 
.............

       Watch this Video for full speech...

                  This is Inspired Speech of Trivikram Words on Sirivennala Garu 
Link for Trivikram Speechhttps://www.youtube.com/watch?v=94XHbmSxjwo


Wednesday 9 April 2014

యువతకు సందేశం

మనం అనుకోనిది జరిగినపుడు
కలిగే ఆనందాన్నీ...
మనం అనుకున్నది జరగనపుడు
కలిగే బాధనీ...
కలిపి బాలన్స్ చేస్తూ
బ్రతకడమే "జీవితం"

నేటి సమాజంలో మనిషి
బ్రతకాలంటే ఎన్నో దారులున్నాయి
కానీ నిజాయితీగా బ్రతకాలంటే
మాత్రం ఒక్కటే దారి
"కష్టపడటం" దాన్ని ఇష్టపడటం
కష్ట పడందే కనీసం మనం
తిన్న అన్నం కూడా సరిగా
జీర్ణం అవదు.

అందుకే ..లక్ష్య సాధనలో
అడ్డుదారులకు అలవాటు పడక
ఒడి దుడుకులను తెలుసుకొని
పరిస్థితులను కనుగొని
కష్ట పడటం అలవరుచుకొని
అవరోధాలను చేధించి
అంతులేని విజయాలను సాధించాలని నా ఆదేశం.!
ఇదే నేటి యుతకు నేనిచ్చే సందేశం..!!


Tuesday 8 April 2014

వయసు - మనసు

మనిషి జన్మిచినపుడు
ఆట బొమ్మలతో
ఆడుకోమ్మంటుంది "వయసు"
అపుడు ఏమి చెప్పాలో
ఆ చిన్ని మనసుకు ఏం తెలుసు ?

యుక్త వయసు రాగానే
విలాసాలతో విహరించమంటుంది "వయసు"
విహరిస్తే నీ జీవితమే
పతనమవుతుందని హెచ్చరిస్తుంది  "మనసు"

మద్య వయసు రాగానే
భార్యా పిల్లలతో  గడపమంటుంది "వయసు"
సంసార బాధ్యతలను
తల్లి దండ్రులను గుర్తించమంటుంది  "మనసు"

వృద్ధాప్యం రాగానే మూడు కాళ్ళతో
మంచాన విశ్రాంతి తీసుకోమంటుంది  "వయసు"
విశ్రాంతే కాక కుటుంబంలో
నీ పాత్రను నిర్వహించమంటుంది "మనసు"

ఈ విధంగా మనిషి జీవితం లో
"వయసు - మనసు" ల సంఘర్షణ జరుగుతూనే వుంటుంది

"వయసు - మనసు" జీవితానికి ఇరుసు

"వయసు - మనసు"  జీవితానికి సొగసు 


ఐదేళ్ల నా ఈ ఐటి ప్రస్థానం


సత్యం...మహింద్రా సత్యం...టెక్ మహింద్రా...
ఐదు సంవత్సరాల్లొ మూడు కంపెనీలలొ పనిచేశానో
లేక మూడు ప్రాజెక్ట్స్ మారానో తెలియదు గానీ ...
ఎంతో కొంత నేర్చుకున్నానని మాత్రం చెప్పగలను.

ఎన్నో ఆశలతో ఆశయాలతో
సత్యంలో మొదలయింది నా ప్రస్థానం
అప్పుడు ఐటీకి అదొక ఆస్థానం

చదివింది ఒకటి... పట్టా పొందింది వేరోకటి
చివరికి జాబ్ చేస్తున్నది మరోకటి
మదిలో ఎన్నో ఆలోచనలు
ఎదలో ఎన్నో ఆవేదనలు
స్థితిగతులు స్థిరంగా ఉండమన్నాయి
పరిస్థితులు పని చేయమన్నాయి
అన్నీ మంచికేనని ముందడుగు వేశా..

ఇంతలోనే...!!

నేను కాలు మోపిన క్షణమో
విధి వెక్కిరించిన తనమో
వెలుగులోకొచ్చిన సత్యం కుంభకోణం
విలయ తాండవం చేస్తున్న ఐటి మాంద్యం
ఆవిరైంది నా ఆశ .. దానితో కొన్నాళ్ళు నిరాశ

ఆ తర్వాత..

బ్రాండ్ కాస్త బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు
సత్యం కాస్త మహీంద్రా సత్యం అయింది
విసుగు చెందక.. వెనకడుగు వేయక
మెదడుకు  పని పెట్టా.. పని మీద ధ్యాస పెట్టా
అందరు చేసే పనినే కొత్తగా చేయడం మొదలు పెట్టా

అధిరోహించాను ఎన్నో అవరోధాలు
అందుకున్నాను ఎన్నో బహుమానాలు
పొందాను అందరి అభిమానాలు

చివరికి మహీంద్రా సత్యం కాస్త
టెక్ మహీంద్రా గా మారిపోఇంది
చూద్దాం మరిన్ని మలుపులో
తప్పదు కదా ఈ కార్పోరేట్ కొలువులో .

నేస్తమా..నీకు వీడుకోలు..!

నేస్తమా..!                                                                         
ప్రతి రోజూ ఆఫీసుకి రాగానే
నిర్మలమైన మనసుతో
నిస్వార్ధపు  హృదయంతో
చెదరని చిరునవ్వుతో
నువ్వు “హాయ్” అనగానే
ఆ పిలుపు మేము వినగానే
నిరీక్షించిన స్వరంతో
నిర్చలమైన నయనంతో
స్వచ్ఛమైన భావంతో
హాయిగా "హలో" అన్నాం
తదుపరి ఖాళీగా వుంటే
కేఫటేరియాకి "చలో"  అన్నాం
అక్కడ "టీ" తో  “టీం” గా భేటి యై
 అందరం చిప్స్ తింటూ
అందరి గాసిప్స్ డిస్కస్స్ చేస్తూ
కాసేపు కబుర్లు   ఆపై కొందరితో విసుర్లు

విధి నిర్వహణలో ఎంతో  పరిపక్వం చెంది
విమర్శకుల  ప్రసంశలెన్నో పొంది
"నీ వల్ల  కాదు" అన్నవాళ్ళ చేతే
"నీతోనే సాధ్యం" అని అనిపించావు

రోజూ నువ్వు ఆఫీసు నుండి వెళుతుంటే
రేపు మళ్లీ వస్తావన్న నిజంతో
మాతో కలుస్తావన్న నమ్మకంతో
మమ్ము పలకరిస్తావన్న ఆశతో
బాధే లేని హృదయంతో "బై" అంటూ
ద్వనిస్తుండేది  మా  స్వరం
అది మాకు డేవుడిచ్చిన  వరం
ఈ రోజు  నీకు "బై" చెప్పాలంటే
బరువెక్కిన   హృదయం
బాధ తో  భయపడుతూ
ఆందోళనతో  ఆరాటపడుతూ
 "వీడుకోలు" అంటూ  విలపిస్తుంది

"వీడుకోలు" అంటే విదిపోవడమో
 వీడి వెళ్లిపోవడమో కాదు

"వీడుకోలు" అంటే  నీతో
 గడిపిన కాలాన్ని - చేసిన స్నేహాన్ని
 గుర్తు చేసుకుంటూ
 నువ్వు  సుఖ – శాంతులతో
 ఆయురారోగ్యాలతో
 నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని
 ఆ దేవుని "వేడుకోలు"   
                        
                                        --  నీ మిత్రులు 

                               

ఎందుకు నీకెందుకు


ఎందుకు  నీవెందుకు
నీది కానిది నీకెందుకు
                
                    ఎందుకు నీకెందుకు

మనిషి మీద అలుసెందుకు
మనసు మీద విసుగెందుకు
సొగసు మీద సోకేందుకు
వయసు మీద వ్యామోహం ఎందుకు

                         ఎందుకు నీకెందుకు

కుల మతాల కుళ్లెందుకు
రక రకాల గుళ్ళెందుకు
కార్పోరేట్ బళ్ళెందుకు
విదేశాల ఊళ్ళెందుకు

                        ఎందుకు నీకెందుకు

పేద ధనిక బేధమెందుకు
ధనమంటే ఆశెందుకు
బలముంటే బలుపెందుకు
లేకుంటే గెలుపెందుకు

                             ఎందుకు నీకెందుకు

వింతైన కోరికలెందుకు
అంతులేని ఆలోచనలెందుకు
స్వార్థం అనే గుణమెందుకు
సంపాదిచాలనే తపనెందుకు

                            ఎందుకు నీకెందుకు

"బంధుత్వం" అనే బంధమెందుకు
మనిషి పోతే బాధెందుకు
ఒకరితో ఇంకొకరికి బేధమెందుకు
అందరం "ఒక్కటే" అని అనరెందుకు

                            ఎందుకు నీకెందుకు

బతుకంటే మోజెందుకు
మేతుకుంటే రోజెందుకు
చావంటే భయమెందుకు
ఈ జీవితం నీకెందుకు

                             ఎందుకు నీకెందుకు


అని ఒక్క సారి ప్రశ్నిస్తే
దొరుకుతుందా ... సమాధానం
ఇదంతా జీవన విధి విధానం
నీ పుట్టుకను నీవు కనవు
నీ చావును నీవు వినవు
వీటి మధ్యలో కొట్టు మిట్టాడేదే
ఈ జీవితం అని ఎందుకు అనవు

"నిన్న" ఇక లేదు
 దాని గురించి ఆలోచించే పని లేదు
"రేపు" ని ఇపుడే రమ్మంటే రాదు
దీని గురించి ఆందోళన అవసరం లేదు
"ఈ రోజు" ని పొమ్మంటే పోదు
అందుకే ఈ క్షణమే నీది

ఈ క్షణం సంతోషంగా ఉంటూ
తోటి వారిని ఆనందంగా ఉంచుతూ
జగమంత ఒకే కుటుంబం అని భావించు
అదే నీ జీవిత పరమార్థం అని గుర్తించు



  

మిస్ యు... బ్రదర్..!

అతి పిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి
అయ్యావు అందరు మెచ్చిన తలారి
అపుడు నీ జీవితం వయసిస్సుల్లేని ఎడారి
విధి నిర్వహణ సాగించావు అందరి చెంతకు చేరి
ఆదర్శం అయ్యావు విఆర్ఓ గా మారి
ఆత్మీయుల్ని పొందావు అభిమానాన్ని కోరి
అందరిని ప్రభావితం చేసింది నువ్వు నడిచిన దారి
చివరికి బాధను మిగిల్చావు దేవుని వద్దకు చేరి

కనుల కొలనులో కన్నీళ్ళు ఇంకిపోయాయి నీకై శోకించి
గుండె బావి లో వున్నబాధ ఎండిపోయింది నీకై పరితపించి

మరో జన్మ అనేది వుంటే ..

                       నీ ఆప్యాయతను అందుకోవాలని
                       నీ అనురాగాన్ని పొందాలని
                       అశ్రు నయనాలతో శ్రద్దాంజలి ఘటిస్తూ....
                             

                                                              ---- మీ తమ్ముడు

నేస్తమా..! మరచిపోలేని మిత్రమా..!!


స్నేహానికే అసూయ పుడుతుంది
                      నీ  స్నేహం చుస్తే

శత్రువులే మిత్రులవుదురు
                     నీతో స్నేహం చేస్తే

కొలీగ్స్ ఎంతో క్లోజ్ అవుతావు
                   నీతో కలిసి పనిచేస్తే

మిత్రులెవరు మరచిపోలేరు
                నిన్ను ఒక్కసారి పలకరిస్తే

రేపటి నుండి నువ్వు మాతో లేకున్నా
ఇకపై నిన్ను చూసే అవకాసం మాకు రాకున్నా
నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనేదే

                    మా ఆశ ..!  మా ఆకాంక్ష..!!

                                              నీ మిత్రులు
                                                      మరియు
                                             శ్రేయోభిలాషులు


వెల్ కం నోట్


సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం
అలుపెరుగని బాటసారులందరూ కలిసి
యుద్దానికి బయలుదేరుతున్న యోధుల్లా
21వ శతాబ్తపు గురుకుల వీధుల్లో
కుప్పం అనే కుగ్రామం లో
మొదలైంది మన సంగ్రామం

అపుడు ....

ఒకరంటే ఒకరికి పరిచయం లేదు
ఒకరితో ఇంకొకరికి అవసరం లేదు
అందరి గురించి ఆలోచించే అభిమానం లేదు
అందరిని ప్రేమించే అనురాగం కూడా లేదు

మనం పెరిగిన పరిస్థితుల వలనో
పెరగడానికి దోహదం చేసిన ప్రదేశాల వలనో
నిత్యం జరుగుతున్న సంఘటలన వలనో
అనునిత్యం అధికమవుతున్న పెను మార్పుల వలనో

అందరం ఒక్కటై
అవరోధాల వారధై
అనుబంధాల లోగిలిలో
ఆప్యాయతల కౌగిలిలో
ముందడుగు వేస్తున్న మనం

ఇపుడు...

ఒకరిని ఒదిలి ఇంకొకరు ఉండలేని విధముగా
కొందరు జీవితాన్ని పంచుకున్నారు
ఇంకొందరు జీతాన్ని పంచుకుంటున్నారు
మరి  కొందరు అందరిని అభిమానించడమే
అలవాటుగా చేసుకున్నారు

పూల దండ అందానికి కారణమైన
పూలను గుర్తిస్తారు అందరు
కాని ఆ పూల అందాలకు ఆధారమైన
దారం గురించి ఆలోచించేది ఎందరు ..?
దండకు దారం దగ్గరైతే
పూదండ ఎంత అలంకారంగా వుంటుందో
మనందరి జీవితాల్లోకి ఊహించని విధంగా
" స్నేహం"  అనే దారం చేరువై
" స్నేహితులం" అనే పూదండగా మారి
" గురుకులం" అనే ద్వారానికి  అలంకారమైనది

ఇక అపుడు - 
మన మేధో సామద్యం గురించి ఆలోచిస్తే

ఇంగ్లీష్ రాదు.. మాథ్స్ అంటే భయం...
కంపుటర్సే తెలియని వాడికి
కంప్యూటర్ లాంగ్వేజ్ తో పనేంటి
అన్నట్లు వుండేది పరిస్థితి
తర్వాత.. కాదు, కూడదు అంటే
సి - ని కసిగా చదివి విసుగు చెందాం
ఇక "జావా"  ని ఐనా జావా తాగినంత
ఈజీగా నేర్చుకుందామని ప్రోగ్రామింగ్ ప్రాక్టీసు చేసినా
గుండె జారి గల్లంతయ్యిందే అన్నట్లు
ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయ్యి బగ్స్ బయటకోచ్చేవి

అలా..

డైలీ టెస్టులు ఆన్ లైన్ క్విట్జ్ లు
వీకెండ్ ప్రెజెంటేషన్ లతో కాస్త విసుగు చెందినా
డైరెక్టర్ పర్యవేక్షణలో మెంటర్ల అండతో
ఆటుపోట్లను ఆసరాగా చేసుకొని
ఆందోళనలకు అలవాటు పడ్డాం
"ఎంత ఎదిగినా ఒదిగి వుండమన్నట్లు"
"ఎక్కడ నెగ్గలొ కాదు - ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి" అన్నట్లుగా

మనం ఎక్కడున్నా.. ఏమి చేసినా
మన తల్లి తండ్రులు
మనం పెరిగిన  ఊరు
మనం చదివిన స్కూలు
చదువు నేర్పిన మాస్టార్లు
మనతో వున్నా స్నేహితులను
మరచిపోతే జీవితంలో ఎంత సంపాదించినా
ఎంత పోగుట్టుకున్నా పెద్ద తేడా వుండదు

అందుకే..

మనందరం చదివిన గురుకులం
గడిపిన జీవితం
చేసిన అల్లరి
వీటన్నిటి గురించి చర్చించుకోవడాని
కష్ట - సుఖాలను పంచుకోవడానికి
స్నేహాభావాన్ని  పెంచుకోవడానికి
ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడుతుందని భావిస్తూ

                                                                              ----  మీ మిత్రుడు 



సాంగ్ ఆన్ త్రివిక్రమ్


హేయ్....
మా గురుదేవుడా.... మాటల మాంత్రికుడా ........
మా గురుదేవుడా.... మాటల మాంత్రికుడా ........
మా గురుదేవుడా.... మాటల మాంత్రికుడా ........
మెటైన రాతగాడా నీకు సాటి లేరురా.....
మెటైన రాతగాడా నీకు సాటి లేరురా.....

త్రివిక్రమ్ శ్రీనివాసుడా నే మెచ్చినోడా...
పవర్ స్టార్ కి ప్రాణ మిత్రుడా..
రైటర్ గా  కాలు పెడితివి...
ఆ పైన నువ్వు డైరక్షన్ లో డాన్ ఐతివి...

హేయ్.... హేయ్.... హేయ్....

త్రివిక్రమ్ శ్రీనివాసుడా నే మెచ్చినోడా...
పవర్ స్టార్ కి ప్రాణ మిత్రుడా..
భీమవరం కాలేజీ లో న్యూక్లియర్ పిజిక్సే చదివి
గోల్డ్ మెడల్ పొంది నీవు
హేయ్.... హేయ్.... హేయ్....
చదువులెన్నో చదివి నువ్వు ఫిలిం నగర్ కి వస్తివంట
చదువులన్ని వదిలి నువ్వు ఫిలిం నగర్ కి వస్తివంట
త్రివిక్రమ్ శ్రీనివాసుడా నే మెచ్చినోడా...
పవర్ స్టార్ కి ప్రాణ మిత్రుడా..

మాటలతో మేజిక్ చేస్తావు
నీ సినిమాల్లో లాజిక్స్ తో లంగరేస్తవు
నువ్వే మా ఇన్స్పిరెషను..... నే మెచ్చినోడా
నీకే ఈ ప్రజెంటేషను

హొయ్.... య్యా..!


      This Song is dedicated to Trivikram Sir on the occasion of his Birthday



సచిన్ - ది గాడ్ ఆఫ్ క్రికెట్


11 ఏళ్ళకే నీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టావ్
16 ఏళ్లకు టీం లో అడుగు పెట్టావ్
అల్ టైం బౌలర్స్ అందరిని చిత్తకోట్టావ్
ప్రపంచమంతా అభిమానుల్ని పట్టావ్

ప్రత్యర్థులు కుళ్ళుకునేలా
ప్రపంచం గర్వించేలా
ప్రతిఒక్కరు కల కనేలా
ఎవరికీ అందని ఎవరెస్ట్ లా ఎదిగావ్
ఇకపై నీ ఆటను చూడలేం అంటే
మేము నమ్మ గలమా?

నీ ఆట చూస్తూ పెరిగాము
నీ ఆట నేర్చుకొని క్రికెట్ ఆడాము
నీతో ఆడే ఆవకాశం లేకున్నా
నీ ఆట చూసే అవసరం మాకున్నా
నీవు మరెప్పటికీ మైదానంలోకి రాకున్నా
టీవీ లో మ్యాచ్ చూస్తున్నప్పుడల్లా
నీ కదలికలు.. నీ అంతుచిక్కని స్క్వేర్ డ్రైవ్ లు
నీకే సొంతమా అనిపించే బౌండరీ లు
నిజమేనా అనిపించే అప్పర్ కట్ లు
మేము మరువగలమా....?

ఎప్పటికీ..... నీవు ఆటలో లేకున్నా
నిన్ను ప్రతి టీం మెంబెర్ లో ఉహించుకుంటాం
నీ ఆటను అందరిలో ఆస్వాదిస్తాం

నీవు ఆటనుండి రిటైర్ అయ్యావ్
అభిమానుల గుండెల్లో నుంచి కాదు
సాటిలేరు నీకెవ్వరు..... పోటి రారు ఇంకెవ్వరు.

జై సచిన్.... జై టెండూల్కర్ .... జై సచిన్ టెండూల్కర్

                  జైహింద్!!
                  ఓ అభిమాని

స్వాతంత్యం ప్రజలకా..! ప్రజా నాయకులకా..!!


67 ఏళ్ళ స్వాతంత్ర్య దేశంలో
ఈ రాష్ట్ర  చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
పదవికోసం ప్రాకులాడే నాయకులు
అవసరం కోసం ఆర్జించే అధికారులు
అయోమయంలో ప్రజలు
రాజకీయ లబ్ధి కోసం
రాష్ట్రాన్ని ప్రాంతాలుగా
ప్రాంతాలను దీవులుగా
మార్చాలనే కపట నాయకుల
పగలు, ఉద్యమ సెగలై
నిరంతరం ప్రజలను వేధిస్తున్నాయి
ఈ స్వాతంత్ర్యం  ప్రజా నాయకులకు
అధికారాన్ని ప్రజలకు  అంధకారాన్ని
మిగిల్చినట్లయింది .

ఇకననైనా భారతీయ పౌరిడిగా జీవించు
భావి తరాలకు ఆదర్శంగా ఆలోచించు
దేశ ప్రగతికై  అన్వేషించు
నువ్వు బాగుంటే దేశం బాగుంటుందని తెలుసుకో
నిజాయితీ గల నాయకుణ్ణి ఎంచుకో
నీ దేశ తలరాతను మార్చుకో

                                       ** జై హింద్ **

స్నేహం - స్నేహితులు


బ్లడ్ రిలేషన్ లేకున్నా... బర్త్ రిలేషన్ కాకున్నా..
స్నేహం అనే పరిచయంతో దగ్గరై
కష్టం వచ్చినపుడు అన్నీ తానై
ప్రేమాను బంధాలతో ఒక్కటై

ఆపదలో ఆడుకొనే ఆప్తుడు
ఆందోళనలో అభాయమిచ్చేవాడు
ఆనందంలో అభినందించే వాడు
మన బాధల్ని పంచుకోనేవాడు
మనల్ని భరించేవాడు
మన మేలుకై పరితపించేవాడు
మరచిపోలేని  " స్నేహితుడు "

పుట్టుకతో ప్రేమను పంచె స్నేహం అమ్మ
మన రూపాన్ని లోకానికి పరిచయం చేసే స్నేహం నాన్న
చదువుకొనే రోజుల్లో తోడుండే మిత్రులు
నిత్యం ప్రోత్సాహం అందించే ఆచార్యులు
వృత్తిలో తోడ్పాటుని  అందించే  సహోద్యోగులు
ఆత్మాభిమానంతో  అలరించే బంధువులు
మనలో సగమై  జీవితం పంచుకొనే భాగస్వామి

ఇలా..

మనం పెరిగిన పరిస్థితుల వలన
నిత్యం మారుతున్న ప్రదేశాల వలన
అనునిత్యం జరుగుతున్న పెనుమార్పుల  వలన
ఏర్పడే స్నేహితులు  ఎందరున్నా
అందరి మద్య వుండే  విడదీయలేని బంధమే  " స్నేహం"

మరచిపోకు నీ మిత్రులను
వదలబోకు  నీ స్నేహాన్ని

అభిమానంతో  " స్నేహితులని" పెంచుకో
అనురాగంతో  " స్నేహాన్ని"  పంచుకో
నీకు నువ్వే సాటి అని నిరూపించుకో
                                           
                                        **  స్నేహితుల  దినోత్సవ శుభాకాంక్షలు **




Monday 7 April 2014

హ్యాపీ బర్త్ డే !

కిల కిల పలుకులతో పలువురిని
పలుకరించే మనస్తత్వం నీది

గల గల మాటలతో అందరిని
అలరించే అమాయకత్వం నీది

చక చక పనులతో ఎందరినో
ఆకట్టుకొనే నాయకత్వమే నీది

నీతో వుంటే తెలియదు సమయం
అదో గమ్యం లేని పయనం
కాబోదు ఎప్పటికి అది అయోమయం

పుట్టిన రోజంటే పండుగే అందరికి
కానీ పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ..?

స్తితి గతులను కనుకొని
పరిస్తితులను తెలుసుకొని
బాధ్యతలను గుర్తించి
ముందడుగు వేయాలని

నూతన సంవత్సరం లో జన్మించిన నీకు



                                **పుట్టిన రోజు శుభాకంక్షలు**