Tuesday 8 April 2014

వెల్ కం నోట్


సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం
అలుపెరుగని బాటసారులందరూ కలిసి
యుద్దానికి బయలుదేరుతున్న యోధుల్లా
21వ శతాబ్తపు గురుకుల వీధుల్లో
కుప్పం అనే కుగ్రామం లో
మొదలైంది మన సంగ్రామం

అపుడు ....

ఒకరంటే ఒకరికి పరిచయం లేదు
ఒకరితో ఇంకొకరికి అవసరం లేదు
అందరి గురించి ఆలోచించే అభిమానం లేదు
అందరిని ప్రేమించే అనురాగం కూడా లేదు

మనం పెరిగిన పరిస్థితుల వలనో
పెరగడానికి దోహదం చేసిన ప్రదేశాల వలనో
నిత్యం జరుగుతున్న సంఘటలన వలనో
అనునిత్యం అధికమవుతున్న పెను మార్పుల వలనో

అందరం ఒక్కటై
అవరోధాల వారధై
అనుబంధాల లోగిలిలో
ఆప్యాయతల కౌగిలిలో
ముందడుగు వేస్తున్న మనం

ఇపుడు...

ఒకరిని ఒదిలి ఇంకొకరు ఉండలేని విధముగా
కొందరు జీవితాన్ని పంచుకున్నారు
ఇంకొందరు జీతాన్ని పంచుకుంటున్నారు
మరి  కొందరు అందరిని అభిమానించడమే
అలవాటుగా చేసుకున్నారు

పూల దండ అందానికి కారణమైన
పూలను గుర్తిస్తారు అందరు
కాని ఆ పూల అందాలకు ఆధారమైన
దారం గురించి ఆలోచించేది ఎందరు ..?
దండకు దారం దగ్గరైతే
పూదండ ఎంత అలంకారంగా వుంటుందో
మనందరి జీవితాల్లోకి ఊహించని విధంగా
" స్నేహం"  అనే దారం చేరువై
" స్నేహితులం" అనే పూదండగా మారి
" గురుకులం" అనే ద్వారానికి  అలంకారమైనది

ఇక అపుడు - 
మన మేధో సామద్యం గురించి ఆలోచిస్తే

ఇంగ్లీష్ రాదు.. మాథ్స్ అంటే భయం...
కంపుటర్సే తెలియని వాడికి
కంప్యూటర్ లాంగ్వేజ్ తో పనేంటి
అన్నట్లు వుండేది పరిస్థితి
తర్వాత.. కాదు, కూడదు అంటే
సి - ని కసిగా చదివి విసుగు చెందాం
ఇక "జావా"  ని ఐనా జావా తాగినంత
ఈజీగా నేర్చుకుందామని ప్రోగ్రామింగ్ ప్రాక్టీసు చేసినా
గుండె జారి గల్లంతయ్యిందే అన్నట్లు
ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయ్యి బగ్స్ బయటకోచ్చేవి

అలా..

డైలీ టెస్టులు ఆన్ లైన్ క్విట్జ్ లు
వీకెండ్ ప్రెజెంటేషన్ లతో కాస్త విసుగు చెందినా
డైరెక్టర్ పర్యవేక్షణలో మెంటర్ల అండతో
ఆటుపోట్లను ఆసరాగా చేసుకొని
ఆందోళనలకు అలవాటు పడ్డాం
"ఎంత ఎదిగినా ఒదిగి వుండమన్నట్లు"
"ఎక్కడ నెగ్గలొ కాదు - ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి" అన్నట్లుగా

మనం ఎక్కడున్నా.. ఏమి చేసినా
మన తల్లి తండ్రులు
మనం పెరిగిన  ఊరు
మనం చదివిన స్కూలు
చదువు నేర్పిన మాస్టార్లు
మనతో వున్నా స్నేహితులను
మరచిపోతే జీవితంలో ఎంత సంపాదించినా
ఎంత పోగుట్టుకున్నా పెద్ద తేడా వుండదు

అందుకే..

మనందరం చదివిన గురుకులం
గడిపిన జీవితం
చేసిన అల్లరి
వీటన్నిటి గురించి చర్చించుకోవడాని
కష్ట - సుఖాలను పంచుకోవడానికి
స్నేహాభావాన్ని  పెంచుకోవడానికి
ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడుతుందని భావిస్తూ

                                                                              ----  మీ మిత్రుడు 



No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| వెల్ కం నోట్ |