Monday 7 April 2014

మరచిపోలేని నేస్తం

ప్రియతమా..! 
మరచిపోలేని మిత్రమా..!!
నీవు నన్నోదిలినా
నీ మనసు నన్ను వీడనంటుంది
నీ ఆలోచనలు అనునిత్యం
నా చుట్టూ తిరుగుతున్నాయి
ఇక నిన్ను మరువుట సాధ్యమా..!

నా కనుపాపలు కలలను మాని
కలువరిస్తున్నాయి నీకోసం
తొలి సంధ్యలో సూర్యుడి వలె
నా మనసును నిదురలేపుతావు
నాలో ఎన్నో ఆశలు  రేపుతావు
అంతలోనే మాయమై
నా కలలను కనుమరుగయ్యేలా  చేస్తావు

మనసులో ఎన్నో ఆలోచనలున్నాయ్
మనిషిగా ఎన్నో భావాలున్నాయ్
వీటన్నిటిని  కలగలిపి
నీకు లేఖగా రాయాలనుకున్నా
కానీ కలం కదలటం లేదు
పెదవి మెదపటం లేదు
పదం పలుకుట లేదు

వీటిని నీకు చెప్పలేక మూగబోయింది నా మనసు

అదెందుకో నీకు తెలుసు..!!

No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| మరచిపోలేని నేస్తం |