Monday 7 April 2014

నా మనసెరిగిన సత్యం

అందని అనురాగాన్ని ఆశించకు
అందిన అభిమానాన్ని త్యజించకు
అందీ అందని ఆక్రోశానికి లోనవకు

అనుకున్నవి జరిగినపుడు ఆనందపడకు
అనుకోనివి జరిగినపుడు బాధపడకు

ఇష్టం అనుకున్నది ఎంత కష్టమైనా ప్రయత్నించు
అవసరం లేని దాని గురించి అతిగా ఆలోచించకు

నా మనసును నిత్యం పలుకరించే నువ్వు
నా మంచికై అనునిత్యం  తపించే నువ్వు
నన్నొదిలి ఎందుకు వేళ్ళిపోవు
నన్ను ఎందుకు  మనశ్శాంతిగా ఉండనివ్వు

నీవు నన్నొదిలి వెళ్ళినా
నీ ఆలోచనలు  ఆత్మలై
నా చుట్టూ  తిరుగుతున్నాయి

ఇది నా మనసెరిగిన సత్యం!
జరుగుతుంది నిత్యం!!

No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| నా మనసెరిగిన సత్యం |