Tuesday 8 April 2014

ఎందుకు నీకెందుకు


ఎందుకు  నీవెందుకు
నీది కానిది నీకెందుకు
                
                    ఎందుకు నీకెందుకు

మనిషి మీద అలుసెందుకు
మనసు మీద విసుగెందుకు
సొగసు మీద సోకేందుకు
వయసు మీద వ్యామోహం ఎందుకు

                         ఎందుకు నీకెందుకు

కుల మతాల కుళ్లెందుకు
రక రకాల గుళ్ళెందుకు
కార్పోరేట్ బళ్ళెందుకు
విదేశాల ఊళ్ళెందుకు

                        ఎందుకు నీకెందుకు

పేద ధనిక బేధమెందుకు
ధనమంటే ఆశెందుకు
బలముంటే బలుపెందుకు
లేకుంటే గెలుపెందుకు

                             ఎందుకు నీకెందుకు

వింతైన కోరికలెందుకు
అంతులేని ఆలోచనలెందుకు
స్వార్థం అనే గుణమెందుకు
సంపాదిచాలనే తపనెందుకు

                            ఎందుకు నీకెందుకు

"బంధుత్వం" అనే బంధమెందుకు
మనిషి పోతే బాధెందుకు
ఒకరితో ఇంకొకరికి బేధమెందుకు
అందరం "ఒక్కటే" అని అనరెందుకు

                            ఎందుకు నీకెందుకు

బతుకంటే మోజెందుకు
మేతుకుంటే రోజెందుకు
చావంటే భయమెందుకు
ఈ జీవితం నీకెందుకు

                             ఎందుకు నీకెందుకు


అని ఒక్క సారి ప్రశ్నిస్తే
దొరుకుతుందా ... సమాధానం
ఇదంతా జీవన విధి విధానం
నీ పుట్టుకను నీవు కనవు
నీ చావును నీవు వినవు
వీటి మధ్యలో కొట్టు మిట్టాడేదే
ఈ జీవితం అని ఎందుకు అనవు

"నిన్న" ఇక లేదు
 దాని గురించి ఆలోచించే పని లేదు
"రేపు" ని ఇపుడే రమ్మంటే రాదు
దీని గురించి ఆందోళన అవసరం లేదు
"ఈ రోజు" ని పొమ్మంటే పోదు
అందుకే ఈ క్షణమే నీది

ఈ క్షణం సంతోషంగా ఉంటూ
తోటి వారిని ఆనందంగా ఉంచుతూ
జగమంత ఒకే కుటుంబం అని భావించు
అదే నీ జీవిత పరమార్థం అని గుర్తించు



  

No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| ఎందుకు నీకెందుకు |