Monday 7 April 2014

ఓ మై ఫ్రెండ్ ..!

మిత్రమా..!
ఈ మూడు అక్షరాల  పేరు వినగానే
ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లి
నీతో పరిచయాన్ని
గడిచిన కాలాన్ని
గుర్తుకు తెచ్చుకోవలనిపిస్తుంది
అపుడు.. అమాయకంగా వుండే నువ్వు
అమితంగా ఆకర్షించే నీ నవ్వు
నేనెప్పటికీ మరచిపోలేను

నీ మాటలతో మురిపించావ్
ఆటలతో అలరించావ్
ఫీలింగ్స్ తో మై మరిపించావ్
నీతో పరిచయం నాకొక వరం
నీతో అనుభవం నాకొక వైభవం
నువ్వు నాకు ప్రేమతో పరిచయంయ్యవ్
స్నేహంతో దగ్గరయ్యావ్
ఇప్పుడు పెళ్ళితో ముందుకు వెలుతున్నవ్

ఆ తర్వాత.... అందరిలా ..
"మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లెవ్ " అని అనకుండా
ఎప్పటిలా మన స్నేహం కొనసాగాలని  ఆశిస్తూ ..
కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న నిన్ను
మనసారా అభినందిస్తూ ...!


నిరంతరం నీ క్షేమం కోరే ...
                                                                ..... నీ నేస్తం..!!


1 comment:

Don't You Think this Awesome Post should be shared ??
| ఓ మై ఫ్రెండ్ ..! |