Tuesday 8 April 2014

వయసు - మనసు

మనిషి జన్మిచినపుడు
ఆట బొమ్మలతో
ఆడుకోమ్మంటుంది "వయసు"
అపుడు ఏమి చెప్పాలో
ఆ చిన్ని మనసుకు ఏం తెలుసు ?

యుక్త వయసు రాగానే
విలాసాలతో విహరించమంటుంది "వయసు"
విహరిస్తే నీ జీవితమే
పతనమవుతుందని హెచ్చరిస్తుంది  "మనసు"

మద్య వయసు రాగానే
భార్యా పిల్లలతో  గడపమంటుంది "వయసు"
సంసార బాధ్యతలను
తల్లి దండ్రులను గుర్తించమంటుంది  "మనసు"

వృద్ధాప్యం రాగానే మూడు కాళ్ళతో
మంచాన విశ్రాంతి తీసుకోమంటుంది  "వయసు"
విశ్రాంతే కాక కుటుంబంలో
నీ పాత్రను నిర్వహించమంటుంది "మనసు"

ఈ విధంగా మనిషి జీవితం లో
"వయసు - మనసు" ల సంఘర్షణ జరుగుతూనే వుంటుంది

"వయసు - మనసు" జీవితానికి ఇరుసు

"వయసు - మనసు"  జీవితానికి సొగసు 


No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| వయసు - మనసు |