Tuesday 8 April 2014

ఐదేళ్ల నా ఈ ఐటి ప్రస్థానం


సత్యం...మహింద్రా సత్యం...టెక్ మహింద్రా...
ఐదు సంవత్సరాల్లొ మూడు కంపెనీలలొ పనిచేశానో
లేక మూడు ప్రాజెక్ట్స్ మారానో తెలియదు గానీ ...
ఎంతో కొంత నేర్చుకున్నానని మాత్రం చెప్పగలను.

ఎన్నో ఆశలతో ఆశయాలతో
సత్యంలో మొదలయింది నా ప్రస్థానం
అప్పుడు ఐటీకి అదొక ఆస్థానం

చదివింది ఒకటి... పట్టా పొందింది వేరోకటి
చివరికి జాబ్ చేస్తున్నది మరోకటి
మదిలో ఎన్నో ఆలోచనలు
ఎదలో ఎన్నో ఆవేదనలు
స్థితిగతులు స్థిరంగా ఉండమన్నాయి
పరిస్థితులు పని చేయమన్నాయి
అన్నీ మంచికేనని ముందడుగు వేశా..

ఇంతలోనే...!!

నేను కాలు మోపిన క్షణమో
విధి వెక్కిరించిన తనమో
వెలుగులోకొచ్చిన సత్యం కుంభకోణం
విలయ తాండవం చేస్తున్న ఐటి మాంద్యం
ఆవిరైంది నా ఆశ .. దానితో కొన్నాళ్ళు నిరాశ

ఆ తర్వాత..

బ్రాండ్ కాస్త బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు
సత్యం కాస్త మహీంద్రా సత్యం అయింది
విసుగు చెందక.. వెనకడుగు వేయక
మెదడుకు  పని పెట్టా.. పని మీద ధ్యాస పెట్టా
అందరు చేసే పనినే కొత్తగా చేయడం మొదలు పెట్టా

అధిరోహించాను ఎన్నో అవరోధాలు
అందుకున్నాను ఎన్నో బహుమానాలు
పొందాను అందరి అభిమానాలు

చివరికి మహీంద్రా సత్యం కాస్త
టెక్ మహీంద్రా గా మారిపోఇంది
చూద్దాం మరిన్ని మలుపులో
తప్పదు కదా ఈ కార్పోరేట్ కొలువులో .

No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| ఐదేళ్ల నా ఈ ఐటి ప్రస్థానం |