Monday 7 April 2014

పుట్టిన రోజు

మనిషి ఎల్లలు దాటి పరిగెత్తే రోజు
మనసు అలలు దాటి  పయనించే రోజు
వయసు ఉప్పెనై  ఉరకలెత్తే  రోజు
మనం జరుపుకొనే పుట్టిన రోజు

గత సంవత్సరపు లోటుపాట్లను  గుర్తించి
రాబోవు  ఆటుపోట్లను  అంచనా వేసి
ఆలోచననలను ఆయుధాలుగా చేసి
అనుభుతులనే అశ్వాలపై
జీవితమనే  యుద్ధానికి
బయలుదేరుతున్న నీకు
విజయం చేకూరాలని
దేవుని ప్రార్థిస్తూ...


                             **పుట్టిన రోజు శుభాకాంక్షలు**


No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| పుట్టిన రోజు |